- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కెనడాలో విమాన శిక్షణ సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. మృతులను తమిళనాడుకు చెందిన మనోజ్ శివకుమార్, పుదుచ్చేరికి చెందిన శ్రీశరన్ తిరుజ్ఞానసంబంధంగా గుర్తించారు. వాంకువర్‌లోని భారత కాన్సులేట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఘటనపై కాన్సులేట్ సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేసింది. మృతుల భౌతికకాయాలను భారత్‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపింది.
- Advertisement -



