నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో తమ బెస్ట్ ఇన్ టెక్ అవార్డ్స్ (BITA) రెండవ ఎడిషన్ విజేతలను అమేజాన్ ఇండియా ప్రకటించింది. ఈ అవార్డ్స్ స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్ టాప్స్, టాబ్లెట్లు మరియు వేరబుల్స్, ఆడియో, కెమేరాలు, గృహోపకరణాలతో సహా సంవత్సరంలోని ఉత్తమమైన వినియోగదారు సాంకేతికతను గుర్తిస్తాయి. విజేతలు మూడు దశలలో నిర్ణయించబడతారు: మార్కెట్ విశ్లేషణ ద్వారా ప్రతి శ్రేణిలో అత్యంత ఉత్తమమైన రేటింగ్ పొందిన ఉత్పత్తులను గుర్తించారు. తుది జాబితాను రూపొందించడానికి ఒక జ్యూరీ వాటిని మూల్యాంకనం చేసింది మరియు కస్టమర్లు తమ ఓటు ద్వారా నిర్ణయాన్ని తెలియచేసారు. అక్టోబర్ 8 నుండి ప్రారంభమయ్యే అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సమయంలో గొప్ప ధరలకు ఈ సంవత్సరపు ఉత్తమమైన టెక్ ను కొనుగోలు చేయవచ్చు.
“తక్కువ సమయంలోనే, ‘ది బెస్ట్ ఇన్ టెక్ అవార్డ్స్’ భారతదేశంలో వినియోగదారుల సాంకేతికతకు ఒక ప్రమాణంగా నిలిచాయి. ప్రతి విజేత తమ స్థానాన్ని రెండుసార్లు సంపాదించుకున్నారు—మొదట Amazon.inలో అత్యధిక రేటింగ్ పొందిన ఉత్పత్తుల్లో ఒకటిగా, ఆ తర్వాత వినియోగదారుల ఓట్ల ద్వారా. కేవలం రెండో ఎడిషన్‌లోనే, వినియోగదారులు ఇష్టపడే ఉత్పత్తులను సెలబ్రేట్ చేసేందుకు BITA టెక్నాలజీ రంగంలోని ప్రముఖ పేర్లను ఒకచోటికి తీసుకువచ్చింది. అలాగే, ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’కు ముందు, ఈ ఏడాది కొనుగోలు చేయడానికి అత్యుత్తమ టెక్ ఉత్పత్తులపై వినియోగదారులకు విశ్వసనీయమైన షార్ట్‌లిస్ట్‌ను అందిస్తుంది,” అని జెబా ఖాన్, డైరెక్టర్ – కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, అమెజాన్ ఇండియా అన్నారు.
ఈ ఏడాది విజేతలలో ఫ్లాగ్ షిప్ ఆవిష్కరణల నుండి రోజూవారీ ఫేవరెట్లు వరకు ఉన్నాయి. శామ్ సంగ్ గాలక్సీ S26 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఆఫ్ ది ఇయర్ గా పేరు పొందగా, గాలక్సీ Z Fold8 ఉత్తమమైన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గా మరియు Xiaomi 17 సీరీస్ ఉత్తమమైన కెమేరా స్మార్ట్ ఫోన్ గా గెలుపొందాయి. టీవీలలో, సోనీ BRAVIA 2M2 మోస్ట్ ట్రస్టెడ్ టీవీ ఆఫ్ ద ఇయర్ గా పేరు పొందగా, దేశీయంగా అభివృద్ధి చెందిన లూమియో తన విజన్ 9 కోసం మోస్ట్ ట్రెండింగ్ టీవీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గెలుచుకుంది. ద మెటా రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ (Gen 2) బ్రేక్ -త్రూ ప్రోడక్ట్ ఆఫ్ ది ఇయర్ గా పేరు పొందాయి.



