Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం)
: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టంతో ప్రజల భూ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని, రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసు కోవాలని కాటారం సబ్  కలెక్టర్ మయాంక్ సింగ్ తెలిపారు. గురువారం కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూసదస్సు నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. భూ రికార్డులో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సం బంధించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువు లోపు సమస్యలను పరిష్కరిస్తారన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందన్నారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. దరఖాస్తు ప్రక్రియను పరిశీలించి రెవెన్యూ అధికారులకు తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ రామ్మోహన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img