Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసీఐడీ చీఫ్‌గా చారుసిన్హా బాధ్యతల స్వీకరణ

సీఐడీ చీఫ్‌గా చారుసిన్హా బాధ్యతల స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర సీఐడీ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, అదనపు డీజీ చారుసిన్హా గురువారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఆమె ఏడేండ్లుగా సెంట్రల్‌ రిజర్వుడ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) డైరెక్టర్‌గా కేంద్ర సర్వీసుల్లో బాధ్యతలు నిర్వర్తించారు. జమ్మూకాశ్మీర్‌, బీహార్‌, రాజస్థాన్‌, సదరన్‌ సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌గా ఆమె కీలకమైన బాధ్యతలు చేపట్టారు. నిజాయితీ, చిత్తశుద్ధితో పాటు ముక్కుసూటిగా వ్యవహరించే ఐపీఎస్‌ అధికారిగా ఆమెకు పేరుంది. సీఐడీతో పాటు మహిళా భద్రతా, షీటీమ్స్‌, భరోసా సెంటర్‌ వంటి విభాగాలకు ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. సీఐడీ వంటి కీలక విభాగానికి డైరెక్టర్‌గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి పూర్తి ప్రయత్నం చేస్తాననీ, తనపై ప్రభుత్వం, సీనియర్‌ అధికారులు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని చారుసిన్హా నవతెలంగాణకు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img