Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇంటింటికి ప్రభుత్వ ఉపాధ్యాయులు

ఇంటింటికి ప్రభుత్వ ఉపాధ్యాయులు

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్  : విద్యాభివృద్దిలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలంటూ ప్రచారం నిర్వహించారు. శుక్రవారం నసురుల్లాబాద్ మండలం కేంద్రంలోని వివిధ వాడల్లో నసురుల్లాబాద్ ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తుండడంతో పాటు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు విద్యార్థులకు బట్టలు ఉచితంగా అందించడం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. బడీడు పిల్లలను ప్రభుత్వ పా ఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. సర్కారు బడుల్లో లభిస్తున్న వసతులు, సదుపాయాలు, నాణ్య మైన విద్యాబోధనపై కరపత్రాలను పంపిణీ చేస్తూ వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో  ప్రధానోపాధ్యాయుడు జి హన్మండ్లు అంగన్వాడి టీచర్ గౌరమ్మ  ఎస్ఎంసి చైర్మన్ శోభారాణి, ఉపాధ్యాయులు కాంచన, పుష్పలత, అనూష, స్వప్న, రూప, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad