Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రూ.1కోటి ఎంజీఎన్ ఆర్ఎస్ నిధులు మంజూరు.!

రూ.1కోటి ఎంజీఎన్ ఆర్ఎస్ నిధులు మంజూరు.!

- Advertisement -

మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు..
నవతెలంగాణ – మలహర్ రావు:
మండల అభివృద్ధి ప్రభుత్వం రూ.1కోటి ఎంజిఎన్ ఆర్ఎస్ నిధులు విడుదల చేసినట్లుగా తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలోని పెద్ద తుండ్ల గ్రామపంచాయితి పరిధిలోని కిషన్ రావు పల్లి అంగన్ వాడి నూతన భవన నిర్మాణం కోసం రూ.12 లక్షలు, గాదంపల్లిలో అంగన్ వాడి నూతన భవన నిర్మాణం కోసం రూ.12 లక్షలు, పెద్ద తూoడ్ల అంగన్ వాడి సెంటర్-2 (అడ్వాలపల్లి) భవన నిర్మాణం కోసం రూ.12 లక్షలు,వల్లెంకుంట గ్రామంలో అంగన్ వాడి భవన నిర్మాణం కోసం రూ.12 లక్షలు, మల్లంపల్లి గ్రామంలో అంగన్ వాడి భవన నిర్మాణం కోసం రూ.12 లక్షలు,అదేవిధంగా కొయ్యూరు గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం రూ.20 లక్షలు, మల్లంపల్లి గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.20 లక్షల నిధులు15వ ఆర్థిక సంవత్సరం నిధులు రూ.1 కోటి మంజూరైనట్లుగా తెలిపారు. ఇట్టి నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు మండల ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img