Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeసమీక్షఅరుదైన ఛాయా చిత్రం

అరుదైన ఛాయా చిత్రం

- Advertisement -

కవయిత్రి తన చూసిన దశ్యాలపట్ల స్ఫూర్తి చెంది, అనుభూతి పొంది వాటిని కవితాత్మకంగా ఆవిష్కరించారు. ఆయా అంశాలను తనదైన రీతిలో సమర్థవంతంగా, ఔచిత్యంగా వ్యక్తీకరించి వాటికి సార్థకత చేకూర్చారు. అప్పుడే ఆ కవిత, కవయిత్రి భావానుభూతిని పాఠకుల దగ్గరకు తేవడంలో సఫలీకతం అయిన వారిలో తిరునగరి దేవకీదేవి ఒకరు అనడానికి తను వెలువరించిన ”అరుదైన ఛాయా చిత్రం ” సంపుటి నిదర్శనం. ”దేశమంటే మతమౌఢ్యం కానే కాదు/ మట్టిలోని మనుషులని గ్రహించండి/ సాహిత్యమో, సంస్కరణో/ ఆయుధంగా చేపట్టండి ” – పుట79 దేశపురోగతికి సన్నద్ధంకండి అని చెపుతున్నారు. ఈ సంపుటిలో నేను కవయిత్రిని కానే కాను, ఫలితం తప్పదు, నేనెట్లా అపవిత్రురాలినయ్యా!, స్వచ్ఛభారత్‌, బ్రహ్మం గారికి తెలియని పరమ రహస్యం, అరుదైన ఛాయా చిత్రం, మాదివేర్పాటు వాదమే, కరోనాపై రెండు మొదలగు కవితలతో పాటు మిగతా కవితలు కూడా పాఠకులను ఆలోచింపజేస్తాయి. నిరంకుశాః కవయః అన్నట్టు బ్రహ్మంగారికి తెలియని పరమ రహస్యం కవితలో మోడీ వ్యక్తిగత శైలిని ఇలా ప్రశ్నిస్తారు. ” సన్నాసినని చెప్పుకుంటూనే / సవాలక్ష సోకులు పడవడ్తివి/ ఎంటికలున్నమ్మ కొప్పెట్ల పెట్టినా / అందమే అంటరు కదా/ ఆలిని నువ్వొదిలితివో, నిన్నే ఆలొదిలెనో / ఏమైనా నీకది చెల్లుబాటు / నువ్వమ్మకు దండంబెట్టినా భేషే / తొమ్మిది పదులు పైబడ్డ అమ్మను / క్యూలో నిలబెట్టినా భేషే / శంఖంలో పోసింది తీర్థమై కూసుంటది ” అని పుట 34 లో అంటారు. తన సహచరుడిని ”నేస్తమా!, అవ్యక్త నిరీక్షణ కవితలలో స్మరించుకున్నారు. తొలి తెలంగాణ ఉద్యమం తో పాటు తాను అనేక సాంఘిక అంశాలను ఈ కవితల్లో చిత్రించారు. కవయిత్రికి అభినందనలు.
– టి.శ్రీరంగస్వామి, 9949857955

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img