Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeరిపోర్టర్స్ డైరీవారేవ్వా.. మోడీజీ…

వారేవ్వా.. మోడీజీ…

- Advertisement -

మన ప్రధాని నరేంద్ర మోడీ… తాజాగా కాశ్మీర్‌ లోని చినాబ్‌ రైల్వే బ్రిడ్జీని ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన ఒక్కడే ఆ వంతెనపై నడుచుకుంటూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ ఎత్తైన బ్రిడ్జీని తలపైకెత్తి మరీ చూస్తూ వీడియోగ్రాఫర్లకు పని కల్పించారు. ఈ బ్రిడ్జీతో ఇటు కాశ్మీర్‌ వాసులు, అటు పర్యాటకులు ఎంతో సంబరపడిపోతున్నారు. కాశ్మీర్‌ అద్భుత అందాలను తిలకించేందుకు ఈ బ్రిడ్జీ దోహదపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గతంలో మాజీ ప్రధాని నెహ్రూ నాగార్జున సాగర్‌, బాక్రానంగల్‌, హిరాకుడ్‌ తదితర భారీ ప్రాజెక్టులను అత్యద్భుతంగా నిర్మించారు. పంచవర్ష ప్రణాళికలను రూపొందించి, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. ఆయన మాదిరిగానే ఇతర ప్రధానులూ దేశాన్ని అభివృద్ధి చెందించారు. కాకపోతే అప్పట్లో వారు చేసి చూపిన అద్భుతాలను క్షణాల్లో ప్రపంచం మీదికి విసిరేందుకు ఇప్పటి మాదిరిగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపాయే. వాట్సాప్పులు, ఫేసుబుక్కులు అసలే లేవాయే. ఇప్పుడు మన మోడీ గారికి ఆ అవకాశం అదృష్టంలా తగిలింది. ఏం చేసినా, ఎక్కడికి పోయినా, ఏం మాట్లాడినా…తెగ ప్రచారంలోకి వచ్చేస్తున్నారు. అదరగొట్టేస్తున్నా రంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. వారేవ్వా… మోడీజీ…
-కే.నరహరి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad