Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిముసలివాడు నడుస్తున్నాడు

ముసలివాడు నడుస్తున్నాడు

- Advertisement -

రైలు పట్టాల అంచుల వెంట
ఒక ముసలివాడు నడుస్తున్నాడు
మెల్లిగా… మెల్లిగా…
అతని నడకలో కాలపు గతి దాగింది
అతని కన్నుల్లో గతం ప్రకాశిస్తుంది

అతడు కలల సముద్రంపై తేలుతున్నాడు
ఆలోచనల మీద వద్ధాప్యం ముద్ర వేసింది
ఎక్కడికి వెళ్తున్నాడో తనకే తెలియదు
కానీ గతం అతన్ని మరచిపోనివ్వదు
పట్టాల అంచున ఒక కాలినడక మార్గం
దాని చివర ఒక పచ్చని మైదానం
అక్కడే బహుశా
అతని ప్రయాణం ముగుస్తుంది
అక్కడే బహుశా అతడు కొంత విశ్రాంతి తీసుకుంటాడు

అతడు ఏ పంటలు
పండించలేదు
ఎవరినీ తనవారుగా చేసుకోలేదు
కానీ అతని నీడలు
అతనితోపాటు నడుస్తున్నాయి

ఒక రోజు ఈ ప్రయాణం ఆగిపోతుంది
అతని జ్ఞాపకాలు మాత్రం
అక్కడే నిలిచిపోయేస్తాయి

రైలు పట్టాల అంచున నడుస్తున్న ఈ ముసలివాడు
మన జీవితాల కథనే చెప్తున్నాడు
మందగతి, ఆలోచనలు, ఆశలు, బాధలు
చివరికి మనిషి తననే తాను చూసుకుంటాడు
అతని జీవితమే
అతనికి సాక్షిగా మిగిలిపోతుంది
-నజీర్‌ అహ్మద్‌
8500443170

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad