Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: విద్యార్థులు, జనరల్ బస్‌పాస్‌ల చార్జీలను తాజాగా తెలంగాణ ఆర్టీసీ పెంచిన దాదాపు దాదాపు 20 శాతం విషయం తెలిసిందే. దీంతో ప్రజలు, విద్యార్థులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా ఇవాళ బస్ భవన్ ముట్టడికి యత్నించారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్‌ ఎదుట ఎమ్మెల్సీ కవిత బైటాయించారు. ఈ క్రమంలోనే ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే ఆర్టీసీ పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బస్‌పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపిందని మండిపడ్డారు. విద్యార్థులు, చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుందని, బస్‌పాస్ ధరలను పెంచి ప్రజలపై గుదిబండను మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెంపుతో ఒక్క ప్రయాణికుడిపై నెలకు దాదాపు రూ. 300 పైగా భారం పడుతుందని అంచనా వేశారు. మరోవైపు అనేక రూట్లలో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు పడిందన్నారు. ఎమ్మెల్సీ కవితను తొలుత చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. ఇప్పుడు కంచన్ బాగ్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంతకు ఏ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారో స్పష్టంగా చెప్పడం లేదని పోలీసులపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad