Tuesday, July 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ ప్రభు కిరణ్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది అటెండెన్స్, సమయపాలన, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం చేయాలన్నారు. జాతీయ కార్యక్రమాల గురించి ఆన్ గోయింగ్, టీవీ ఎంయుకెటిహెచ్ భారత్, ఇమ్యునైజేషన్, ఎన్సిడి ప్రోగ్రాం, ఆస్పత్రిలో గర్భిణీ స్త్రీల ప్రసవాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బిక్నూర్ పట్టణ కేంద్రంలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేసి వ్యాధి నిరోధక టీకాలు వివరాలు, వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ పొటెన్సీ, రిజిస్టర్లు పరిశీలించి చిన్నారులకు క్రమం తప్పకుండా టీకాలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి యేమిమా, హెచ్ ఈ ఓ వెంకటరమణ, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -