Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంవిషాదం.. విషవాయువులు పీల్చి ఇద్దరు మృతి

విషాదం.. విషవాయువులు పీల్చి ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరో దుర్ఘటన సంభవించింది. ఫార్మాసిటీలోని ఎస్ఎస్ (సాయి శ్రేయస్) ఫార్మా కంపెనీలో రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలోని రసాయన వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్ వద్ద స్థాయిలను తనిఖీ చేయడానికి వెళ్లిన ముగ్గురు కార్మికులు అక్కడ విడుదలైన రసాయన విషవాయువులను పీల్చి అస్వస్థతకు గురయ్యారు. కార్మికులు చంద్రశేఖర్, కుమార్ మృతి చెందగా, మరో కార్మికుడు షీలానగర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలిసిన వెంటనే పరవాడ సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img