నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్, ఇరాన్ దేశాపై వైమానిక దాడి చేసిన విషయం తెలిసిందే.ఈక్రమంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ఆదేశ సైన్యంపై ప్రశంసల వర్షం కురిపించారు. తమ బలగాలు విజయవంతంగా ఆదేశంపై దాడి చేశాయని, అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చిత్వంతో నేలమట్టం చేశాయని కొనియాడారు. దీంతో ఆదేశానికి చెందిన కీలక నేతను హతమర్చారని, భవిష్యత్‌లో మరిన్ని విజయాలను తమ సైన్యం సాధిస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. ’’ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించింది. తమ మనుగడను సవాల్ చేసే ఇరాన్ ముప్పును తిప్పికొట్టేందుకే చేపట్టిన సైనిక చర్య ఇది. ముప్పును పూర్తిగా తొలగించేంతవరకు చాలా రోజుల పాటు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇటీవలి కాలంలో ఇరాన్ (Iran) అధిక మొత్తంలో శుద్ధిచేసిన యురేనియంను ఉత్పత్తి చేసింది. దాంతో 9 అణుబాంబులు తయారు చేయొచ్చు’’ అని నెతన్యాహు వెల్లడించారు.
ఇజ్రాయిల్ సైన్యంపై నెతన్యాహు ప్రశంసలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES