- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ‘గద్దర్ ఫిలిం అవార్డులు‘ ప్రదానోత్సవాలపై కీలక ప్రకటన వెలువడింది. ఇవాళ ‘గద్దర్ ఫిలిం అవార్డులు” ప్రదానోత్సవ సంబురాలు జరుగనున్నాయి. 14 ఏళ్ల తర్వాత సినీ పురస్కార వేడుక జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైటెక్స్ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుంది.
ఇక ‘గద్దర్ ఫిలిం అవార్డులు” ప్రదానోత్సవ సంబురాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. గద్దర్ ఫిలిం అవార్డులు అందుకోబోతున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు
- Advertisement -