Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeఆటలు27 ఏళ్ల కలను నిజం చేసుకున్న సఫారీలు

27 ఏళ్ల కలను నిజం చేసుకున్న సఫారీలు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఘ‌న విజ‌యం సాధించింది. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయ దుందుభి మోగించింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో సౌతాఫ్రికా కొత్త‌ హిస్టరీ క్రియేట్ చేసింది. తొలిసారి ICC టైటిల్ సాధించింది. 27 ఏళ్ల కలను నిజం చేసుకున్న సఫారీలు. దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు నష్టపోయి 282 లక్ష్యాన్ని చేధించింది. గత 27 సంవత్సరాలుగా ఆఫ్రికాపై ఉన్న ‘చోకర్స్’ ముద్ర తొలిగిపోయింది. దక్షిణాఫ్రికా 1998లో తన ఏకైక ICC టైటిల్‌ను గెలుచుకుంది.

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసింది. బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టు 207 పరుగులు చేసి బవుమా జట్టుకు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మార్ క్రమ్ 207 బంతుల్లో 14 ఫోర్లు బాది 136 పరుగులు సాధించాడు. డేవిడ్ గై బెడింగ్‌హామ్ 18 పరుగులతో రాణించారు. కెప్టెన్ బవుమా 134 బంతుల్లో 66 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

లార్డ్స్ లో 250కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఘనత సాధించింది సౌతాఫ్రికా. టెస్ట్ చరిత్రలో కేవలం మూడు సార్లు మాత్రమే ఇది సాధ్యం అయ్యింది. నాలుగోసారి ఆ రికార్డ్ క్రియేట్ చేసింది సఫారీ జట్టు. 1984లో వెస్టిండీస్ 344 పరుగులను… 2004లో ఇంగ్లాండ్ 282 పరుగులను… 2022లో ఇంగ్లాండ్ 277 పరుగులను విజయవంతంగా ఛేదించింది.. తాజాగా సౌతాఫ్రికా కూడా 282 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad