- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ఫిల్మ్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే.. పలువురు సినీ ప్రముఖులు హైటెక్స్‌కు చేరుకోగా.. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- Advertisement -