Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్ఆత్మకూ తప్పని కష్టాలు

ఆత్మకూ తప్పని కష్టాలు

- Advertisement -

నవతెలంగాణ – సిరిసిల్ల: ఆఖరి మజిలీలో మరణించిన శవానికి సైతం కష్టాలు తప్పడం లేదు. మరణించిన వ్యక్తి దహన సంస్కారాలకు వైకుంఠదామం లేకపోవడం అంత దౌర్భాగ్యం మరోటి లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్లలోని చిన్న బోనాలకు చెందిన బత్తుల శంకర్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనను దహన సంస్కారాలు చేయడానికి స్మశాన వాటిక లేకపోవడంతో రెండు కిలోమీటర్ల దూరంలో గల అటవీ ప్రాంతంకు శంకర్ మృతానికి తీసుకువెళ్లి, దహన సంస్కారాలు చేశారు. ప్రభుత్వం మారినా మా తలరాతలు మారటం లేదని, పాలకులు పట్టించుకోవడంలేదని, ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎవరికీ రావద్దని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మరణించిన వ్యక్తిని దహనసంస్కారాలకు తీసుకువెళ్లడానికి ఉపయోగించే వాహనం కూడా లేదని, మున్సిపల్ అధికారులు పేర్కొనడం దురదృష్టకరమని ఆ ప్రాంత ప్రజలు పేర్కొన్నారు. 100% ఆస్తి పన్నులు వసూలు అవుతున్న విలీన గ్రామాలపై పురపాలక సంఘం నిర్లక్ష్యంగా వహిస్తుందని చెప్పడానికి ఇవి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad