Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయం2036 ఒలంపిక్స్‌కు హైదరాబాద్‌ బెస్ట్‌ ప్లేస్‌

2036 ఒలంపిక్స్‌కు హైదరాబాద్‌ బెస్ట్‌ ప్లేస్‌

- Advertisement -

– ఎక్స్‌లో స్పందించిన ప్రముఖ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయి
– సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఒలంపిక్స్‌-2036 పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు పోటీపడే నగరాల్లో హైదరాబాద్‌ మొదటి వరుసలో నిలుస్తుందని ప్రముఖ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయి ఎక్స్‌లో పేర్కొన్నారు. ”నేను హైదరాబాద్‌ను సందర్శించిన ప్రతి సారీ, పాత ప్రపంచ ఆకర్షణను కొత్త శక్తులతో కలిసి భారత్‌ భవిష్యత్‌ నగరం గా కనిపిస్తుంటుంది. 2036లో జరిగే ఒలంపిక్స్‌కు భారతదేశంలో ఆతిథ్య నగరంగా మీరు దేన్ని ఎంపిక చేస్తారని అడిగితే మాత్రం హైదరాబాద్‌ను సూచిస్తా. మౌలిక సదుపాయాలు, ల్యాండ్‌ బ్యాంక్‌, శక్తివంతమైన సేవా రంగం, క్రీడా రంగంలో గొప్ప రికార్డు ఉన్న నగరం హైదరాబాద్‌” అని ఆయన పేర్కొన్నారు. ఒలంపిక్స్‌ పోటీలకు ఇండియాలో ఆతిథ్యమిచ్చేందుకు అన్ని అర్హ తలున్న నగరంగా హైదరాబాద్‌ ముందు వరుసలో ఉంటుందని అభిప్రాయ పడ్డ రాజ్‌దీప్‌ సర్దేశాయికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad