Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంమామిడి పండ్ల లారీ బోల్తా

మామిడి పండ్ల లారీ బోల్తా

- Advertisement -

– పండ్ల కోసం సంచులు, బుట్టలతో ఎగబడ్డ జనం
– రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌ వద్ద ఘటన
నవతెలంగాణ-కొత్తూరు

మామిడి పండ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఓవైపు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కాగా.. మరోవైపు జనం పండ్ల కోసం ఎగబడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో శనివారం జరిగింది. ఈ ఘటనలో గాయాలతో రోడ్డుపై పడిపోయిన డ్రైవర్‌కు సహా యం చేయాల్సింది పోయి.. ప్రజలు మానవత్వం మరిచి మామిడి పండ్ల కోసం ఎగపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… షాద్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు మామిడి పండ్లతో బయలుదేరిన లారీ ఓవర్‌ స్పీడ్‌తో అదుపుతప్పి కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్‌ వద్ద బోల్తా పడింది. దాంతో జాతీయ రహదారి-44పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వాహనాలు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్‌ సాయంతో లారీని తొలగించారు. లారీ బోల్తా పడిందని తెలియగానే.. సమీపంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పండ్ల కోసం ఎగబడ్డారు. గాయాలతో ఇబ్బంది పడుతున్న డ్రైవర్‌ను కనీసం పట్టించుకోకుండా.. పండ్లను సంచుల్లో, బుట్టల్లో నింపుకొని తీసుకెళ్లారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad