Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుహైద‌రాబాద్ లో ఘోరం…హైటెన్షన్ వైర్లు తెగిపడి ఇద్దరు సజీవదహనం

హైద‌రాబాద్ లో ఘోరం…హైటెన్షన్ వైర్లు తెగిపడి ఇద్దరు సజీవదహనం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. సాగర్ రింగ్ రోడ్ వద్ద హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడి రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరు బిక్షాటన చేసే వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో ఓ వీధికుక్క అక్కడికక్కడే ఆహుతి అయింది.

ఈ ఘటన తెల్లవారుజామున సమయంలో చోటుచేసుకుంది. 11 కేవీ విద్యుత్ తీగలు బీడింగ్ తెగిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు, వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కరెంట్ నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది.


మృతులిద్దరూ బిక్షాటన చేసి జీవనం కొనసాగిస్తున్న వ్యక్తులుగా గుర్తించబడినప్పటికీ వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇద్దరి మృతదేహాలను ఉస్మానియా ఆస్ప‌త్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైటెన్షన్ వైర్ల భద్రతా లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad