Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనివాస హక్కుల హననం

నివాస హక్కుల హననం

- Advertisement -

– నేరస్తులు తయారవుతున్నారు
– మానవహక్కుల వేదిక నేత అశ్వక్‌ సంస్మరణ సభలో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

దేశంలో, రాష్ట్రంలో పేద ప్రజల నివాస హక్కులు హననానికి గురువుతున్నాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల సమాజంలో నేరస్తుల సంఖ్య పెరుగుతున్నదని విశ్లేషించారు. మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో నివాస హక్కుల నాయకుడు అశ్వక్‌ సంస్మరణ సభ ఆదివారంనాడిక్కడ జరిగింది. మానవ హక్కుల వేదిక హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు సురేష్‌బాబు అధ్యక్షత వహించారు. వేదిక వ్యవస్థాపకులు జీవన్‌కుమార్‌, మాంట్‌ఫోర్ట్‌ సోషల్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంస్థ ప్రతినిధి హైమ, అమన్‌ వేదిక వ్యవస్థాపకులు అనురాధ, యుగంతర్‌ సంస్థ ప్రతినిధి కరీం తదితరులు మాట్లాడారు. పట్టణాల్లో నివాస హక్కుల ఉల్లంఘన వల్ల బాలలు, యువతరం నిర్లక్ష్యానికి గురవుతున్నారనీ, వారిలో నేర ప్రవృత్తి పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వీధి బాలలు, బాల కార్మికులు పెరుగుతున్నారని చెప్పారు. దీనివల్ల భవిష్యత్‌ తరం నిర్వీర్యం అవుతుందని విశ్లేషించారు. నివాస హక్కుల నేత అశ్వక్‌ మూసీ బచావ్‌ ఆందోళన్‌కి సారిధ్యం వహించారని గుర్తుచేశారు. మలక్‌పేటలోని మూసానగర్‌ బస్తీ నుంచి నివాస హక్కుల నేతగా ఎదిగారని నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వేదిక నాయకులు వసంతలక్ష్మి, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad