నవతెలంగాణ – హైదరాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ‘రైతు భరోసా’ నిధులను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలిరోజు 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరి బ్యాంకు ఖాతాల్లోకి ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులను జమ చేశారు. 41.25 లక్షల మంది అన్నదాతలకు సంబంధించి 39.16 లక్షల ఎకరాలకు రూ.2,349.83 కోట్లు జమయ్యాయి. ఇక రెండో రోజు (నేడు) 3 ఎకరాల్లోపు భూమి ఉన్న 10.45 లక్షల మంది రైతులకు గాను రూ.1,551.89 కోట్లు విడుదల చేసినట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. ఎకరాలతో సంబంధం లేకుండా త్వరలోనే మిగతా రైతులకు కూడా ‘రైతు భరోసా’ అందుతుందని, ఎవరూ నిరాశ పడాల్సిన అవసరం పేర్కొన్నారు.
మూడు ఎకరాల ఉన్న రైతులకు ‘రైతుభరోసా’ నిధులు జమ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES