Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకాళేశ్వరం మినిట్స్‌ ఇవ్వండి

కాళేశ్వరం మినిట్స్‌ ఇవ్వండి

- Advertisement -

– సర్కారుకు కమిషన్‌ లేఖ
– ఆలస్యంపై ఆగ్రహం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

కాళేశ్వరం మినిట్స్‌ ఇవ్వాలంటూ న్యాయ విచారణ కమిషన్‌ మరోమారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆలస్యం చేయడాన్ని తప్పుబట్టింది. గత ప్రభుత్వంలోని క్యాబినెట్‌ మినిట్స్‌ ఇవ్వాలంటూ మూడోసారి లేఖ పంపింది. ఎన్నిసార్లు లేఖలు రాయాలంటూ సర్కారుపై కమిషన్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. విచారణలో భాగంగా కేసీఆర్‌ స్టేట్‌మెంట్‌ సైతం తీసుకుంది. అనంతరమే మూడోసారి లేఖ రాసింది. ఇంజినీర్లు ఓపెన్‌ కోర్టు స్టేట్‌మెంటు తర్వాత ఓసారి, ఐఏఎస్‌ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాసిన విషయం విదితమే. గతంలో రాసిన లేఖలకు పూర్తిస్థాయిలో కమిషన్‌కు సర్కారు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. కమిషన్‌కు మినిట్స్‌ ఇవ్వాలా ? వద్దా ? అనే అంశాన్ని క్యాబినెట్‌లో చర్చించనున్నట్టు తెలిసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad