Sunday, December 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమూడు ఎకరాల్లోపు రైతులకు 'రైతు భరోసా'

మూడు ఎకరాల్లోపు రైతులకు ‘రైతు భరోసా’

- Advertisement -

– రూ.1,551.89 కోట్ల నిధులు విడుదల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

మూడు ఎకరాల్లోపు భూమి ఉన్న 10.45 లక్షల మంది రైతులకుగానూ రూ.1,551.89 కోట్లు విడుదల చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఎకరాలతో సంబంధం లేకుండా త్వరలోనే మిగతా రైతులకు కూడా ‘రైతు భరోసా’ అందుతుందనీ, ఎవరూ నిరాశ పడాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వానాకాలం సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ‘రైతు భరోసా’ నిధులను సోమవారం సీఎం రేవంత్‌ రెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలిరోజు రెండు ఎకరాల వరకు ఉన్న 41.25 లక్షల మంది అన్నదాతలకు రూ.2,349.83 కోట్లు జమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -