Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeనల్లగొండమల్లాపూర్,రాయికల్ పోలీస్ స్టేషన్‌ల్లోఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీలు

మల్లాపూర్,రాయికల్ పోలీస్ స్టేషన్‌ల్లోఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీలు

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్: రాయికల్, మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ల పరిసరాలను,స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న నమోదైన కేసుల వివారలు, స్టేషన్ రికార్డులను తనిఖీ చేసి, కేసుల దర్యాప్తు విషయంలో అలసత్వం వహించవద్దని సూచించారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాల‌న్నారు. బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ ల పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. పాత నేరస్థులపై నిఘా ఉంచాలన్నారు.నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు,ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు, యువతకు ప్రత్యేకంగా,షీ టీమ్స్, ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాల నివారణ పై చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులను మోసం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాల‌న్నారు .అనంతరం సిబ్బంది తో మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరూ కృషి చేయాలన్నారు.పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న విధానం పట్ల పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. ఎస్పి వెంట ఎస్ఐలు సుదీర్ రావు,రాజు ఉన్నారు.

t
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad