No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్విద్యార్థుల పోలీస్ స్టేషన్ సందర్శన

విద్యార్థుల పోలీస్ స్టేషన్ సందర్శన

- Advertisement -

నవతెలంగాణ -తాడ్వాయి : సాధారణంగా విద్యార్థులను విద్యా పర్యటనకు తీసుకువెళ్లడం పరిపాటి. అయితే ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలను, ఆ పాఠశాల ఉపాధ్యాయులు పిడి రాంచందర్, ఉపాధ్యాయురాలు సునీత, సరళ, ఉషా, ప్రభ సిబ్బంది తాడ్వాయి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి, పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు ఎలా ఉంటుంది? అని విషయం గురించి తెలియజేశారు. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ పాఠశాల విద్యార్థినీలను ఏకంగా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి స్టేషన్ ను ఇబ్బందుని పరిచయం చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన పిల్లలను ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది స్వాగతించారు. విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో జరిగే దైనందిన కార్యకలాపాలు, శాంతి భద్రతల రక్షణ గురించి తెలిపారు. చట్టాలు, సైబర్ నేరాలు, ఫోక్సో చట్టం, మాదకద్రవ్యాల వినియోగం వాటి వలన కలిగే అనర్థాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. పిల్లల సందేహాలను నివృత్తి చేశారు. విద్యార్థుల ప్రశ్నలకు సిబ్బంది సముచిత్తం తోసమాధానలిచ్చారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad