Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఇజ్రాయిల్‌ మారణహోమాన్ని ఆపాలి

ఇజ్రాయిల్‌ మారణహోమాన్ని ఆపాలి

- Advertisement -

– పాలస్తీనా సంఘీభావ దినాన్ని జయప్రదం చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

ఇజ్రాయిల్‌ మారణహోమాన్ని అపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. భారత ప్రభుత్వం పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలని, ఇజ్రాయిల్‌తో అన్ని సైనిక, భద్రతా సహకారాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. బుధవారం రంగారెడ్డి ఙల్లా ఇబ్రహీంపట్నంలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 నెలలుగా గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ నిరంతర బాంబు, వైమానిక దాడులకు పాల్పడుతున్నదన్నారు. మారణహోమాన్ని సృష్టిస్తూ యుద్ధానికి పూనుకున్నదన్నారు. ఇప్పటికే దాదాపు 50వేల మంది మృతిచెందారని తెలిపారు. ఐక్యరాజ్య సమితితో పాటు, ప్రపంచవ్యాపితంగా ఈ దుశ్చర్యను వ్యతిరేకిస్తున్నా, అమెరికా దాని కొన్ని మిత్రదేశాల మద్దతుతో ఇది కొనసాగిస్తుందన్నారు. దాంతోపాటు ఇటీవల ఇరాన్‌పై సైతం యుద్ధాన్ని ప్రకటించి భీభత్సం సృష్టిస్తున్నదన్నారు. అంతర్జాతీయ చట్టం, మానవహక్కులు కాలరాస్తున్నదని తెలిపారు. ఈ దురహంకార మారణహోమ యుద్ధాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో పాలస్తీనాకు సంఘీభావంగా కార్యక్రమాలు నిర్వహించాలని అఖిల భారత వామపక్ష పార్టీలు పిలుపు మేరకు వామపక్ష పార్టీలు, ప్రపంచశాంతిని కోరుకునే ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఈ నెల 19న సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. భాస్కర్‌, దుబ్బాక రాంచందర్‌, బి. సామేల్‌, చంద్రమోహన్‌, జి.కవిత, జగదీష్‌, కె.జగన్‌, ఈ. నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad