Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంతీర్పును స్వాగతిస్తోన్నాం

తీర్పును స్వాగతిస్తోన్నాం

- Advertisement -

– ఏఐఎడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పశ్చిమబెంగాల్లో మూడేండ్లుగా నిలిపివేసిన ఉపాధి హామీ చట్టాన్ని మళ్లీ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఎడబ్ల్యూయూ) స్వాగతించింది. ఈ మేరకు బుధవారం ఏఐఎడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ ప్రకటన విడుదల చేశారు. ఈ తీర్పులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హైకోర్టు గట్టి విమర్శలు చేసిందని తెలిపారు. నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించవచ్చు కానీ, లక్షల మంది పేద గ్రామీణ కార్మికులకు ఉపాధి హక్కు నిలిపివేయడం సరికాదని కోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. పనుల్లేక బెంగాల్‌ నుంచి లక్ష మంది వలసలు పోయారని, అయినా టీఎంసీ, బీజేపీ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నాయని ఆయన విమర్శించారు. మూడేండ్లుగా గ్రామీణ పేదలు ఉపాధి కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. ఏప్రిల్‌ 20న ఏఐఎడబ్ల్యూయూ, సీఐటీయూ, ఏఐకేఎస్‌ ఆధ్వర్యంలో మార్చ్‌ టు బ్రి గేడ్‌ కార్యక్రమాన్ని లక్షల మందితో నిర్వహించినట్టు గుర్తు చేశారు. వేల గ్రామాల్లో ఉపాధి పనుల కోసం యాత్రలు చేశామనీ, మరోవైపు అనేక మంది కోర్టును ఆశ్రయించారని తెలిపారు.అలాగే బెంగాల్‌లో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరగాలని, దోపిడీ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 2025 ఆగస్టు 1 నుండి ఉపాధి హామీ పనులు పూర్తిస్థాయిలో అమలులోకి రావాలని ,రోజు వేతనం రూ.600కు పెంచాలని డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad