Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్నిప్పాన్‌ కోయి ఇండియా ఎండీగా సంపత్‌ కుమార్‌

నిప్పాన్‌ కోయి ఇండియా ఎండీగా సంపత్‌ కుమార్‌

- Advertisement -

హైదరాబాద్‌: జపాన్‌కు చెందిన ఐడీఅండ్‌ఈ హోల్డింగ్స్‌ అనుబంధ సంస్థ నిప్పాన్‌ కోయి ఇండియా (ఎన్‌కేఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా జి సంపత్‌ కుమార్‌ నియమితులయ్యారు. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఈ సంస్థ తొలిసారి భారతీయుడికి బాధ్యలను అప్పగించింది. సంపత్‌ కుమార్‌ నియామకం జూన్‌ 17 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంతక్రితం ఆయన బీడీ అండ్‌ మార్కెటింగ్‌కు సీఎండీగా ఉన్నారు. కాగా.. ఇప్పటి వరకు ఎన్‌కేఐకి ఎండీగా వ్యవహారించిన కట్యుస పకసకు వైదొలిగారు. ఇది భారత మార్కెట్‌ పట్ల తమ నిబద్ధతను, నాయకత్వ ప్రతిభ గుర్తింపునకు నిదర్శమనం ఆ సంస్థ పేర్కొంది. ఎన్‌కేఐ భారత్‌లో రవాణా, పట్టణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణతో సహా వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కలిగి ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad