Friday, July 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుస్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు..

స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు, ట్రంప్‌ నిర్ణయాలపై దృష్టిపెట్టిన మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నాయి. దీంతో సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 24,800 మార్క్‌ దాటింది. అటు గత కొన్ని రోజులుగా పెరుగుతోన్న ముడిచమురు ధరలు నేడు కాస్త దిగొచ్చాయి.
ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 187.73 పాయింట్లు పెరిగి 81,549.60 వద్ద, నిఫ్టీ 48.65 పాయింట్ల లాభంతో 24,841.90 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 86.58గా ట్రేడ్‌ అవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -