No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజిల్లాలుతెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్

తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ  నలుమూలలకు చేర్చిన ప్రచండ శక్తి తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సల్ల సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శనివారం పాఠశాలలో నిర్వహించిన జయశంకర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సమీకరించు, బోధించు, పోరాడు అనే అంబేద్కర్ మార్గంలో జయశంకర్ సార్ తెలంగాణ భావజాల వ్యాప్తి  చేయగలిగాడని ఆయన వేసిన బలమైన పునాదులే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికాయని ఆయన అన్నారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ ప్రపంచానికి భారతదేశం అదించిన వరం యోగా అని ఆయన అన్నారు. జూన్ 21న జయశంకర్ సార్ వర్ధంతి తో పాటు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతర్జాతీయ సంగీత దినోత్సవం నిర్వహించుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి గోపాల్, రాధాకృష్ణ,  జావిద్, డాక్టర్ గంగాధర్, ఘనపురం దేవేందర్,  కృష్ణంరాజు , స్వరూప, శ్రీలత, అనిత, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. విద్యార్థులు వివిధ యోగాసనాలతో ఆకట్టుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad