నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని 386 సర్వేనెంబర్ లో పట్టాలు ఉన్న రైతులకు రైతుబంధు ఇవ్వాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో రైతులు వినతి పత్రం అందజేశారు. రైతు భరోసా నిధులు రానీ గ్రామానికి చెందిన సుమారు 200 మంది రైతులు సోమవారం కలెక్టరేట్ కు తరలి వెళ్లారు.386 సర్వే నెంబర్ లో అసైన్డ్ భూములు ఉన్నాయని పేర్కొంటూ గతంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో అధికారులు ఈ సర్వే నంబర్ ను బ్లాక్ చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. దీంతో సుమారు 200 మంది రైతులకు గత రెండు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన రైతు భరోసా నిధులు అందలేదని వాపోయారు. ఈ సర్వే నంబర్ లో పట్టాలున్న రైతులను గుర్తించి రైతుబంధు అందించాలని వినతిపత్రంలో కోరారు. స్పందించిన అధికారులు ఈ విషయమై పూర్తి వివరాలతో నివేదిక అందించాలని తహసిల్దార్ ను ఆదేశించినట్లు ఈ సందర్భంగా రైతులు తెలిపారు. ప్రజావాణికి తరలి వెళ్లిన వారిలో రైతులు బద్దం రాజశేఖర్, నూకల బుచ్చి మల్లయ్య, ఉట్నూరి బాలయ్య, పెంట కిషన్, తదితరులు ఉన్నారు.
రైతుబంధు ఇవ్వాలని ప్రజావాణిలో వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES