Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంనేడే శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణం

నేడే శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణం

- Advertisement -

న్యూఢిల్లీ: భారత వ్యోమగ్యామి శుభాంశుశుక్లా అంతరిక్ష ప్రయాణం ఖరాయింది. శుభాంశుశుక్లాతో కూడిన యాక్సియం-4 మిషన్‌ ప్రయోగం భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు జరగనున్నట్లు నాసా మంగళవారం ప్రకటించింది. అమెరికాలో ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌లో దీన్ని ప్రయోగించనున్నట్లు వెల్లడించింది. అప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ యాత్ర బుధవారం జరగనున్నట్లు స్పష్టం చేసింది. యాక్సియం-4లో శుభాంశుశుక్లాతో పాటు మరో ముగ్గురు రోదసిలోకి వెళ్లనున్నారు. భూమి నుంచి బయలుదేరిన 28 గంటల తర్వాత వీరి వ్యోమనౌక.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)తో అటాచ్‌ అవుతుంది. శుభాంశు శుక్లా బృందం అక్కడే 14 రోజుల పాటు బస చేసి అనేక ప్రయోగాలు నిర్వహించనుంది. బుధవారం ప్రయోగం విజయవంతమయితే రాకేశ్‌ శర్మ తరువాత భారత్‌ నుంచి అంతరిక్ష యానం చేసిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టిస్తారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad