Friday, August 22, 2025
E-PAPER
spot_img
HomeNewsటీఎఫ్‌జేఏ ఐ క్యాంప్‌ విజయవంతం

టీఎఫ్‌జేఏ ఐ క్యాంప్‌ విజయవంతం

- Advertisement -

తెలుగు ఫిలిం జర్నలిస్ట్‌ అసోస ియేషన్‌ (టీఎఫ్‌జేఏ) ఆధ్వర్యంలో శనివారం ఫీనిక్స్‌ ఫౌండేషన్‌, శంకర్‌ ఐ హాస్పిటల్‌ సంయుక్తంగా తెలుగు ఫిలిం చాంబర్‌లో హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాయి. ఈ సందర్బంగా జర్నలిస్టులకు ‘ఐ స్క్రీనింగ్‌ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో ప్రియదర్శి, ప్రొడ్యూసర్‌ నాగ వంశీ, ఫీనిక్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ అవినాష్‌ చుక్కపల్లి, శంకర్‌ ఐ హాస్పిటల్‌ యూనిట్‌ హెడ్‌ విశ్వమోహన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రియదర్శి, నాగ వంశీ రిబ్బన్‌ కట్‌ చేసి ఐ క్యాంప్‌ను ప్రారంభించారు. ఫీనిక్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ అవినాష్‌ చుక్కపల్లి, శంకర్‌ ఐ హాస్పిటల్‌ యూనిట్‌ హెడ్‌ విశ్వ మోహన్‌, టీఎఫ్‌జేఏ ప్రెసిడెంట్‌ లక్ష్మీనారాయణ, వైస్‌ ప్రెసిడెంట్‌ రఘు, జనరల్‌ సెక్రటరీ వై.జె. రాంబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. హెల్త్‌ క్యాంప్‌లో భాగంగా ప్రియదర్శి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆయన చూపు పర్ఫెక్ట్‌ ఆల్‌ రైట్‌ అని వైద్యులు తెలిపారు. ఐ క్యాంప్‌ గురించి ప్రియదర్శి మాట్లాడుతూ, ‘తెలుగు ఫిలిం జర్నలిస్ట్‌ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్‌ క్యాంప్‌కు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అని అన్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ క్యాంప్‌లో జర్నలిస్టులు, వాళ్ల కుటుంబ సభ్యులు ఫ్రీగా కంటి పరీక్షలు చేయించుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad