Friday, June 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలునిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆరోగ్యశాఖలో జాబ్ నోటిఫికేషన్లు విడుదల

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆరోగ్యశాఖలో జాబ్ నోటిఫికేషన్లు విడుదల

- Advertisement -
  • – డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు వెలువడిన నోటిఫికేషన్లు
  • – స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్‌కు జూలై 14 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఆహ్వానం
  • – ప్రభుత్వ హాస్పిటల్స్‌లో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం
  • – మరో 6 వేలకుపైగా పోస్టులకు కొనసాగుతున్న భర్తీ ప్రక్రియ
  • నవతెలంగాణ – హైదరాబాద్: ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి మరో 2 నోటిఫికేషన్లను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం విడుదల చేసింది. ఇందులో డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 48 ఉండగా, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు 4 ఉన్నాయి. స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి 26వ తేదీ వరకూ.. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూలై 14 నుంచి 25వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఇతర వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో (https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm) అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.

గత 18 నెలల కాలంలో ప్రభుత్వ దవాఖాన్లలో 8 వేలకుపైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో డాక్టర్స్‌, స్టాఫ్‌ నర్స్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్‌, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్‌ తదితర పోస్టులు ఉన్నాయి. మరో 6 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ 1284, మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్, 1930, ఫార్మసిస్ట్ 732, నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్‌) 2322, తదితర పోస్టులు ఉన్నాయి. తాజాగా 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అవనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -