Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంసత్తుపల్లి నుంచి అరుణాచలానికి బస్సు

సత్తుపల్లి నుంచి అరుణాచలానికి బస్సు

- Advertisement -

కరపత్రం విడుదల చేసిన డీఎం రాజ్యలక్ష్మి..
జూలై 8న సర్వీస్ ప్రారంభం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
: సత్తుపల్లి డిపో నుంచి వచ్చే అరుణాచలానికి బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ యూ.రాజ్యలక్ష్మి తెలిపారు. అశ్వారావుపేట బస్ స్టాండ్ లో శుక్రవారం ఆమె బస్ సర్వీస్ సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేసారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే నెల( జూలై) 8 న సాయంత్రం 7 గంటలకు సత్తుపల్లి డిపోలో బయలుదేరి సూపర్ లగ్జరీ బస్  జులై 10వ తేది పౌర్ణమి నాటికి అరుణాచలానికి చేరుకుంటుందని వారు తెలిపారు.

సత్తుపల్లి డిపో నుండి అరుణాచలం కు సూపర్ లగ్జరీ (2+2 పుష్ బ్యాక్ సీట్లు) కలిగిన బస్ మార్గమధ్యంలో కాని పాకం,గోల్డెన్ టెంపుల్ దర్శనానంతరం జూలై 10 పౌర్ణమి రోజు అరుణాచలం చేరుకుంటుంది అని అన్నారు. అరుణాచలంలో గిరి ప్రదక్షణ అనంతరం తిరిగి సత్తుపల్లి బస్సు బయలుదేరుతుంది అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. పెద్దలకు రూ.5 వేలు,పిల్లలకు రూ. 2510 లు చార్జీ గా నిర్ణయించినట్లు ఆమె వివరించారు. 

ఆన్లైన్ రిజర్వేషన్ కొరకు TGSRTC BUS.IN లాగిన్ అయ్యి 99599 సర్వీస్ ద్వారా టికెట్లను పొందవచ్చునని అన్నారు.సత్తుపల్లి డిపో పరిధిలోని భక్తులు ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా డిపో మేనేజర్ కోరారు. మరిన్ని వివరాలకు 9866619189, 9542698518 సంప్రదించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో విలేజ్ బస్ ఆఫీసర్ కిన్నెర ఆనందరావు,అశ్వారావుపేట కంట్రోలర్ ఆర్.వి.రావు,ఆర్టీసీ సిబ్బంది ప్రయణీకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad