Sunday, June 29, 2025
E-PAPER
Homeబీజినెస్వారెన్‌ బఫెట్‌ రూ.51వేల కోట్ల విరాళం

వారెన్‌ బఫెట్‌ రూ.51వేల కోట్ల విరాళం

- Advertisement -

గేట్స్‌ ఫౌండేషన్‌కు కేటాయింపు
వాషింగ్టన్‌
: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒక్కరైన వారెన్‌ బఫెట్‌ సామాజిక సేవ కార్యక్రమాలకు కోసం భారీగా విరాళం ప్రకటించారు. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నిర్వహిస్తున్న గేట్స్‌ ఫౌండేషన్‌కు ఏకంగా 6 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.51వేల కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తానికి విలువ చేసే బెర్క్‌షైర్‌ హాత్‌ వే షేర్లను కేటాయించారు. ఒక్క ఏడాదిలో ఇంత పెద్ద మొత్తం విరాళంగా ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ మొత్తాన్ని గేట్స్‌ ఫౌండేషన్‌తో పాటు, ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నట్లు ప్రకటించారు. వారెన్‌ బఫెట్‌ 152 బిలియన్‌ డాలర్ల (రూ.13 లక్షల కోట్లు) నికర విలువతో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద సంపన్నుడిగా ఉన్నారు. తాజా విరాళంతో ఆయన ఆరో స్థానానికి తగ్గిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -