Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంబీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

- Advertisement -

– ఒకరు చెబితే నిర్ణయం తీసుకునే పార్టీ మాది కాదు
– బీసీకి అధ్యక్ష పదవి గురించి అడిగే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ కు లేదు : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బీజేపీపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ హెచ్చరించారు. ఒకరు చెబితనే నిర్ణయం తీసుకునే పార్టీ తమది కాదని స్పష్టం చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రామచంద్రరావు పేరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఖరారు చేయడం వెనుక చంద్రబాబు కీలక పాత్ర పోషించారంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తప్పుబట్టారు. ఎవరు ఉన్నా లేకున్నా బీజేపీ నడుస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. అధ్యక్ష పదవి రానంత మాత్రాన మిగితా వాళ్లు డమ్మీ అనుకోవడం కూడా సరికాదని సూచించారు. రామచంద్రరావు డమ్మీ అని తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. బీసీకి బీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నించే అర్హత బీఆర్‌ఎస్‌ నేతలకు లేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే సీఎం అవుతారని స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad