- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం వైభంగా జరిగింది. జూలై 1న ఉదయం 11:51 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో జమదగ్ని మహర్షితో అమ్మవారి పెళ్లి జరిపారు. అమ్మవారి కల్యాణానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఎల్లమ్మ కల్యాణానికి ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారి దర్శనమిచ్చారు. ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మీ కూడా హాజరయ్యారు.
- Advertisement -