మొబైల్ ఫోన్లకు దూరంగా.. పుస్తకాలకు దగ్గరగా ఉండాలి
పట్టుదలతో చదివి ఆకాశమంత ఎదగాలి – డీసీపీ మధుకర్ స్వామి
నవతెలంగాణ – దుబ్బాక : నేటి విద్యార్థులు బట్టి చదువులను పక్కన పెట్టాలని, ఆసక్తి ఉన్న సబ్జెక్టులపై పట్టు సాధించి.. జీవితంలో ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని, మన ఆలోచన విధానమే జీవితాన్ని మార్చేస్తుందని డీసీపీ మధుకర్ స్వామి అన్నారు. మొబైల్ ఫోన్లకు దూరంగా.. పుస్తకాలకు దగ్గర ఉండాలన్నారు. మంగళవారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో హైదరాబాద్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, వాసవి, లయన్స్ క్లబ్ ల సహకారంతో అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “వాట్ నెక్స్ట్” అన్న కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
దుబ్బాక లో ఎస్ఐ గా జీవితాన్ని ప్రారంభించి నేడు ఎస్పీ స్థాయికి ఎదిగానని, ఈ ప్రాంతాన్ని మరువబోనని స్పష్టం చేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్త వహించాలని సూచించారు. పోలీస్, రైల్వే లలో ఉద్యోగాలు పొందగోరే విద్యార్థులు తమను సంప్రదిస్తే అన్ని తామే ఉచితంగా సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఎస్ఐ తౌడ సత్యనారాయణ ను, వాసవి క్లబ్ బాధ్యులు చింతరాజు లను డీసీపీ మధుకర్ స్వామి అభినందించారు.
అనంతరం దుబ్బాకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణతో కలిసి డీసీపీ మధుకర్ స్వామి మొక్కల్ని నాటారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రొఫెసర్లు లక్ష్మీ ప్రసన్న, భవాని, నల్ల నాగరాజు, ఫౌండేషన్ వాలంటీర్లు, కాలేజీ లెక్చరర్లు, పలువురు పాల్గొన్నారు