నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్, ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య నిన్న రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత జట్టు భారీ విజయం సాధించింది. బ్రిస్టల్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు బ్యాటర్లు.. మొదటి టీ20 మాదిరిగానే మంచి ఫామ్ చూపించారు. ఓపెనర్లు తక్కువ స్కోరుకే అవుట్ అయినప్పటికి జెమిమా రోడ్రిగ్స్ 63, అమన్జోత్ కౌర్ 63, రిచా గోష్ 32 పరుగులతో రాణించారు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో చేజింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మొదటి రెండు ఓవర్లలోనే 2 వికెట్లు తీసి.. ఇంగ్లాండ్ విజయంపై దెబ్బ కొట్టారు. అనంతరం మిడిలార్డర్లో టామీ 54, యామి జోన్స్ 32, చివర్లో.. షోపీ 35 పరుగులతో పోరాడారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత జట్టు ఇంగ్లాండ్ పై 24 పరుగుల తేడాతో విజయం సాధించి.. టీ20 సిరీస్ లో 2-0 తో లీడ్ లో కొనసాగుతోంది.
భారత్ భారీ విజయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES