నవతెలంగాణ-హైదరాబాద్ : కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఆరోపణలతో ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపిన దుండగులు ఆపై అతడిని కాలును నరికి వేరు చేశారు. దానిని అందరికీ చూపించిన అనంతరం పోలీస్ స్టేషన్ సమీపంలోనే విసిరేశారు.
పోలీసుల కథనం ప్రకారం కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లెకు చెందిన శేషన్న (54) ఇంట్లో ఉండగా గత అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చొరబడి కొడవళ్లు, కత్తులతో దాడిచేశారు. శేషన్నను దారుణంగా హతమార్చిన అనంతరం అతడి కాలును నరికి వేరు చేశారు. ఆపై దానిని గ్రామంలో ప్రదర్శించి పోలీస్ స్టేషన్ సమీపంలో పడేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.