Friday, July 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలురామ్ చరణ్ అభిమానులకు దిల్ రాజు సోదరుడు క్షమాపణ

రామ్ చరణ్ అభిమానులకు దిల్ రాజు సోదరుడు క్షమాపణ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రామ్ చరణ్ అభిమానులకు దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ రెడ్డి క్షమాపణ చెప్పారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతూ లేఖ విడుదల చేశారు. ‘ఇది గమనిక కాదు.. చివరి హెచ్చరిక’ అంటూ నిన్న ఓ లెటర్ విడుదల చేశారు రామ్ చరణ్ ఫ్యాన్స్.

శిరీష్ కామెంట్లపై చరణ్ ఫ్యాన్స్ కన్నెర్ర చేయడంతో క్షమాపణ చెప్పినట్లు సమాచారం అందుతోంది. ఇక అటు నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఫ్లాఫ్ అయిన సినిమా గేమ్ చేంజర్ గురించి పదేపదే అడుగుతున్నారు… దయచేసి ఇంక ఆ విషయం వదిలేయండి అని కోరారు నిర్మాత దిల్ రాజు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -