Thursday, July 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతిరుపతిలో చిరుత కలకలం..

తిరుపతిలో చిరుత కలకలం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇటీవల కాలంలో తిరుమల తిరుపతిలో చిరుత పులుల సంచారం పెరిగిపోతుంది. గత ప్రభుత్వ హయాంలో భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో టీటీడీ అధికారులు , ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ నిత్యం చిరుత పులుల రోడ్లపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి అలిపిరి నుంచి జూపార్క్ వెళ్లే మార్గంలో వాహనదారులకు చిరుత కనిపించింది. దీంతో అటుగా వెళ్ళే వారు తమ సెల్ ఫోన్ లలో వీడియో తీశారు. ప్రస్తుతం అరవింద ‘ఐ’ ఆసుపత్రి సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తుంది.

తాజా వీడియోలు వైరల్ కావడంతో అప్రమత్తమైన అధికారులు టూవీలర్ వాహనాలపై వెళ్లే భక్తులను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉంటే నిన్న అన్నమయ్య భవనం సమీప అటవీ ప్రాంతంలో కూడా మరో చిరుత సంచరించింది. ఇనుప కంచె దాటుకుని చిరుత గోడపై కూర్చుని ఉన్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా.. చిరుతను చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే రెండు ప్రాంతాల్లో కనిపించిన చిరుతలు ఒకటేనా.. లేక వేరువేరా.. అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉండగా.. ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై.. చిరుతలను ట్రెస్ చేసే పనిలో పడినట్లు తెలుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -