Thursday, July 3, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలో కొత్తరేషన్​కార్డుల పంపిణీ కార్యక్రమం ఈనెల 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రేవంత్​ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామసభలు, మీసేవా ద్వారా రేషన్ కార్డుల కోసం 25 లక్షల దరఖాస్తులు రాగా, అందులో ఎక్కువ శాతం కుటుంబ సభ్యుల వివరాల మార్పులు చేర్పులు జరిగాయి. మిగతావి కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులే. ఇంటింటి పరిశీలన చేసిన అధికారులు 13 లక్షల మంది కుటుంబ సభ్యుల పేర్లను చేర్చారు. అనంతరం 2.55 లక్షల కుటుంబాలను కొత్త కార్డులకు అర్హులుగా నిర్దారించారు. వీరికి 14న సీఎం రేవంత్ కార్డు మంజూరు పత్రాలను అందజేయనున్నారు.

రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం సందర్బంగా స్మార్ట్​కార్డులు ఇవ్వాలని అప్పట్లో సీఎం రేవంత్​ప్రకటన చేశారు. సరికొత్తగా బార్​కోడ్‌తో ఈజీ యాక్సెస్​చేసేలా రూపొందిస్తామని బహిరంగ సభలో తెలిపారు. దీంతో పౌరసరఫరాల అధికారులు డిజిటల్ కార్డులకు సంబంధించిన నమూనాల కోసం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి పరిశీలన చేశారు. ఏటీఎం కార్డు సైజులో ఒక వైపు సీఎం రేవంత్, మరోవైపు మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఫోటోలు.. మధ్యలో ప్రభుత్వ లోగో ఉండేలా డిజైన్​సిద్ధం చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అది కాస్త పెండింగ్ పడింది. దీనికి సంబంధించిన కేసు కూడా ఈనెల 7న బెంచ్ మీదకు రానుంది. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ప్రభుత్వం పెద్దలు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -