Thursday, July 3, 2025
E-PAPER
Homeజాతీయంఈనెల 14న సుప్రీంకోర్టులో శివ‌సేన పార్టీ గుర్తుపై విచార‌ణ‌

ఈనెల 14న సుప్రీంకోర్టులో శివ‌సేన పార్టీ గుర్తుపై విచార‌ణ‌

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: శివ‌సేన పార్టీ గుర్తుపై త్వ‌ర‌గా తీర్పును వెలువ‌రించాల‌ని ఉద్ధ‌వ్ థాక‌రే వ‌ర్గం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. రెండు సంవ‌త్సరాలుగా ఈ అంశంపై కోర్టులో పెండింగ్‌లో ఉంద‌ని, త్వ‌ర‌లో మ‌హారాష్ట్రలో లోక‌ల్ బాడీతో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని, ఈలోపు పార్టీ గుర్తుపై విచార‌ణ చేపట్టి, తీర్పు వెల్ల‌డించాల‌ని థాక‌రే వ‌ర్గం త‌రుపు న్యాయ‌వాది కోర్టుకు తెలియ‌జేశారు. విచార‌ణ చేప‌ట్టిన కోర్టు బెంచ్..ఈనెల 14న లిస్టింగ్‌ డేట్ ఇచ్చింది.

2022లో మహారాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభం త‌లెత్తి… ఏక్నాథ్ షిండే త‌న అనుచ‌రుల‌తో క‌లిసి బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఉద్ధ‌వ్ థాక‌ర్ కు చెందిన వ‌ర్గం.. శివ‌సేన పార్టీ గుర్తుపై త‌మ‌కే పూర్తి అధికారం ఉంటుంద‌ని పేర్కొంది. ఈక్ర‌మంలో 2023 ఫిబ్రవరి 17న, భారత ఎన్నికల సంఘం ఏక్నాథ్ షిండే వర్గాన్ని అధికారికంగా శివసేనకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు గుర్తించింది. దీంతో ఉద్ధవ్ థాకరే భారత సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -