నవతెలంగాణ-హైదరాబాద్: భారత్, చైనాలపై అమెరికా పన్నుల పిడుగు వేయాలనే యోచనలో ఉంది. రష్యా ఆయిల్, విద్యుత్ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటే భారత్, చైనా దిగుమతులపై 500 శాతం అమెరికా పన్నులను విధించనుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్ష్డుఉ ట్రంప్ సంకేతాలిచ్చారు. ట్రంప్ రష్యాను టార్గెట్‌గా చేసుకునే సుంకాలు అత్యధికంగా విధించే సెనేట్ బిల్లుకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ ఆదివారం ఎబిసి న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా -ఉక్రెయిన్ యుద్ధంలో పెద్ద ముందడుగు వేశారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌తో చర్చలు జరపడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే.. ఈ సెనెట్ బిల్లు ప్రవేశపెట్టాలని తనను కోరినట్లు గ్రాహమ్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపివేయాలని చర్యల్లో భాగంనే ట్రంప్ ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు గ్రాహమ్ తెలిపారు.
ఈ నేపథ్యంలోనే యుద్ధానికి సహకరిస్తున్న భారత్ చైనాలపై బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ‘మీరు రష్యా నుండి ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ… ఉక్రెయిన్‌కు సహాయం చేయకపోతే.. అమెరికాలోకి వచ్చే మీ ఉత్పత్తులపై 500 శాతం సుంకం ఉంటుంది. భారత్, చైనా పుతిన్ చమురులో 70 శాతం కొనుగోలు చేస్తాయి. వారు పుతిన్ చేస్తున్న యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి’ అని గ్రాహమ్ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.
అయితే ఈ బిల్లు కాంగ్రెస్‌లో అమోదం పొంది చట్టమైతే దానిపై సంతకం చేయాలా వద్దా అని ట్రంప్ నిర్ణయించుకోవచ్చు అని గ్రాహమ్ నొక్కి చెప్పారు. రష్యాపై ఆంక్షల్ని విధించే ఈ బిల్లుకు 84 మంది సెనేటర్లు మద్దతివ్వనున్నారు. ఈ బిల్లు రష్యా, చైనాలపై ఎకానమీ బంక్ బస్టర్‌గా నిలుస్తుంది. బహుశా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని నేను అనుకుంటున్నాను అని గ్రాV్‌ా ఇంటర్వ్యూలో తెలిపారు.
గ్రాహమ్ వ్యాఖ్యలపై పుతిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పందించారు. అమెరికా సెనేటర్ వైఖరి రష్యాకు తెలుసని, గ్రాహమ్ ప్రకటనను కూడా గమనించామని పెస్కోవ్ పేర్కొన్నారు. ‘సెనేటర్ల అభిప్రాయాలు మాకు బాగా తెలుసు. ప్రపంచం మొత్తానికి బాగా తెలుసు. అతను రష్యన్లను తీవ్రంగా వ్యతిరేకించే గ్రూపుకి చెందినవాడు. రష్యాను ఇబ్బంది పెట్టాలని ఆయన ఇష్టం అయితే.. ఈ ఆంక్షలు చాలాకాలం క్రితమే విధించబడేవి. యుద్ధానికి పరిష్కారమే కోరుకుంటే అమెరికా ఉక్రెయిన్‌కు సహాయపడి ఉండేదా? అలాంటి కార్యక్రమాలను ప్రారంభించేవారు తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న అది అని డిమిత్రీ ధీటుగా బదులిచ్చారు.