నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని ఉప్లూర్, ఏర్గట్ల మండలంలోని తోర్తిగ గ్రామాల్లోని ఆలయాల్లో చోరీకి పాల్పడ్డ నిందితుని అరెస్టు చేసినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భీంగల్ సీఐ పొన్నం సత్యనారాయణతో కలిసి ఆలయాల్లో చోరీకి సంబంధించిన వివరాలను ఎస్ఐ అనిల్ రెడ్డి వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం ఉప్లూర్ ఎల్లమ్మ గుడిలో దొంగతనం జరిగిందని గ్రామానికి చెందిన సదాశివ్ గౌడ్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు.
అందులో భాగంగా బుధవారం మండల కేంద్రంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని విచారించగా ఆలయాల్లో చోరీకి సంబంధించిన వివరాలు తెలిశాయన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామానికి చెందిన తూర్పాటి కనకయ్య ఉప్లూర్ లో ఎల్లమ్మ గుడి, పెద్దమా పోచమ్మ గుడి, ఏరుగట్ల మండలంలో తొర్తి గ్రామంలో శుక్రవారం దేవి, కమ్మర్ పల్లి లో గుండ్లకుంట్ల హనుమాన్ గుడిలో చోరీలకు పాల్పడ్డట్టు ఒప్పుకున్నాడన్నారు. చోరీలకు పాల్పడ్డ కనకయ్య వద్దనుండి రూ.2700 నగదు, వెండి ఆభరణాలు రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితున్ని ఆర్మూర్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. ఆలయాల్లో చోరీ కేసు చేదనకు కృషిచేసిన ఐడి పార్టీ కానిస్టేబుల్ నవీన్ చంద్ర, వినయ్, షౌకత్ అలీ లను భీంగల్ సీఐ పొన్నం సత్యనారాయణ అభినందించారు.
ఆలయాల్లో చోరీ కేసులో నిందితుడి అరెస్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES