- Advertisement -
నవతెలంగాణ – జన్నారం : విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని జన్నారం ఎంపీడీఓ ఉమర్ షరీఫ్ సూచించారు. బుధవారం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు వండుతున్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -