Thursday, July 3, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంథాయ్‌ల్యాండ్‌కు ఒక్క రోజు ప్ర‌ధాని ఎవ‌రంటే..?

థాయ్‌ల్యాండ్‌కు ఒక్క రోజు ప్ర‌ధాని ఎవ‌రంటే..?

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: థాయ్‌ల్యాండ్ డిప్యూటీ పీఎం సురియా జున్‌గ్రున్‌గ్రుంగిట్ బుధవారం ఒక్క రోజుకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించనున్నారు. బుధవారం ఉదయం బ్యాంకాక్‌లోని ప్రధాని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పొరుగు దేశంతో దేశ ర‌హ‌స్యాలు మాట్లాడినందుకు థాయ్‌ల్యాండ్ ప్రధాని పెటంగ‌టార్న్ షిన‌వ‌త్రా పై వేటు పడిన విషయం తెలిసిందే. ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఇవాళ ఆ స‌స్పెన్షన్ విధించింది. ప్రధానమంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తూ రాజ్యాంగ కోర్టు 7-2 తేడాతో తీర్పును వెలువ‌రించింది.

రాజ్యాంగ తీర్పును స‌వాల్ చేస్తూ మ‌రో 15 రోజుల్లోగా ప్ర‌ధాని షిన‌వ‌త్రా త‌న వాద‌న‌ల‌ను వినిపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆమె కేసును డిస్మిస్ చేస్తారు. ఒక‌వేళ పెటంగ‌టార్న్ షిన‌వ‌త్రాను డిస్మిస్ చేస్తే, ప్రధాని బాధ్యత‌ల నుంచి స‌స్పెండ్ అయిన రెండో వ్యక్తిగా ఆమె నిలుస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -